Unified Family Survey Last Date: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఫిబ్రవరి 10 వరకూ ఛాన్స్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. ఏకీకృత కుటుంబ సమగ్ర సర్వే (Unified Family Survey – UFS) చివరి తేదీని ప్రభుత్వం ఫిబ్రవరి 10, 2026 వరకు పొడిగించింది. ఇప్పటివరకు నమోదు చేయని కుటుంబాలు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Unified Family Survey ఎందుకు ప్రారంభించారు?
గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించారు. అయితే ఆ సమయంలో జరిగిన మ్యాపింగ్ తప్పిదాలు, డేటా లోపాలు కారణంగా అర్హులైన చాలా మందికి సంక్షేమ పథకాల లబ్ధి అందడం లేదని ప్రభుత్వం గుర్తించింది.
ఈ సమస్యలను పరిష్కరించేందుకే Unified Family Survey ను కొత్తగా ప్రారంభించారు.
సర్వే గడువు ఎందుకు పెంచారు?
ప్రారంభంలో ఈ సర్వేను 30 రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు.
➡️ మొదట గడువు: జనవరి 12, 2026
➡️ సాంకేతిక సమస్యల కారణంగా ఇప్పుడు
➡️ కొత్త గడువు: ఫిబ్రవరి 10, 2026
గ్రామీణ ప్రాంతాల్లో
- ఇంటర్నెట్ సిగ్నల్ సమస్య
- సర్వర్ డౌన్ అవ్వడం
- డేటా సేవ్ కాకపోవడం
వంటి సమస్యల వల్ల సర్వే నెమ్మదిగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
Unified Family Surveyలో ఏ వివరాలు ఇస్తారు?
ఈ సర్వేలో సుమారు 20కి పైగా అంశాలపై సమాచారం నమోదు చేస్తారు.
ప్రధానంగా👇
- కుటుంబ సభ్యుల వివరాలు
- ఆధార్ ధృవీకరణ
- రేషన్, పెన్షన్, ఆరోగ్య పథకాల వివరాలు
- నివాసం, ఆదాయం, ఉపాధి సమాచారం
టెక్నికల్ ఇష్యూ వస్తే మొత్తం డేటా పోతుండటంతో ఒక్కో కుటుంబానికి గంటకు పైగా సమయం పడుతోందని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు.
ఆఫ్‌లైన్ సర్వేకు అవకాశం ఉందా?
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా Unified Family Survey నిర్వహించే అవకాశం ఇవ్వాలని కోరారు.
తాజా సమాచారం ప్రకారం👇
- జనవరి చివరి నుంచి ఆఫ్‌లైన్ సర్వేకు అవకాశం ఇవ్వొచ్చు
- దీనిపై త్వరలో అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది
ఎవరు తప్పకుండా సర్వే చేయించుకోవాలి?
- ఇప్పటివరకు సర్వేలో పేరు నమోదు కానివారు
- పథకాలు ఆగిపోయిన కుటుంబాలు
- కుటుంబ వివరాల్లో తప్పులు ఉన్నవారు
- కొత్తగా పెళ్లైన / విడిపోయిన కుటుంబాలు
చివరి సూచన
ఫిబ్రవరి 10 తర్వాత గడువు పొడిగించే అవకాశం లేదని అధికారులు సూచిస్తున్నారు.
సంక్షేమ పథకాల భవిష్యత్ లబ్ధి కోసం
Unified Famili Survey తప్పనిసరి.
❓ FAQs – Unified Family Survey 2026
1. Unified Famili Survey చివరి తేదీ ఏమిటి?
➡️ ఫిబ్రవరి 10, 2026.
2. ఆన్లైన్లో చేయలేకపోతే?
➡️ త్వరలో ఆఫ్‌లైన్ సర్వే అవకాశం రావచ్చు.
3. సర్వే చేయకపోతే ఏమవుతుంది?
➡️ భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల లబ్ధి నిలిచే అవకాశం ఉంది.
4. ఎక్కడ చేయించుకోవాలి?
➡️ గ్రామ/వార్డు సచివాలయం ద్వారా.